ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

WhatsApp Image 2025-12-28 at 6.54.22 PM

 సంగారెడ్డి : 

కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత బిజెపికి లేదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ 140 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు నిర్మల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ శ్రేణుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ... దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అర్పించారని గుర్తు చేశారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు. బిజెపి పార్టీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలకు పాల్పడుతుందన్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. యువత వారి కుట్రను గ్రహించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు సి డి సి రామ్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు సదాశివపేట మండల అధ్యక్షులు సిద్ధన్న పట్టణ అధ్యక్షుడు జార్జ్ నాయకులు బుచ్చి రాములు నర్సింహారెడ్డి సంతోష్ కిరణ్ గౌడ్ మహేష్ శ్రీకాంత్ గౌడ్ బలవంత్ రెడ్డి అనిల్ చారి కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author