
సంగారెడ్డి :
భారత దేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ 136వ జయంతి వేడుకలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు నిర్వహించే కార్యక్రమాలను తిలకించారు. స్థానిక నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ నెహ్రు జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేశారా మిషన్లు ఓటేశాయ అర్థం కావట్లేదు. నేను రాహుల్ గాంధీకి ఒకటే చెప్పదలుచుకున్న బీహార్ పోతే పోయింది రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పండిత్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ జీవిత చరిత్రను తెలిపేలా ప్రత్యేక డాన్స్ స్కిట్లతో కూడిన సాంస్కృతి కార్యక్రమాలు చిన్నారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిజిఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి, తోపాక్షి అనంత కిషన్ కోన సంతోష్ రఘు గౌడ్ సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.