ప్రశాంతంగా ముగిసిన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటన.

సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల

ప్రశాంతంగా ముగిసిన  గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటన.

ఉమ్మడి ఆదిలాబాద్:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి.నిర్మల్ జిల్లా పర్యటన ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల తెలిపారు.
ఈ సందర్భంగా బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, అలాగే ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సూచనలకు సహకరించిన జిల్లా ప్రజలకు జిల్లా పోలీసు శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అందరి సమన్వయం, సహకారం వల్లే ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించగలిగామని, భవిష్యత్తులో కూడా ప్రజల సహకారం ఇలానే కొనసాగాలని జిల్లా ఎస్పీ కోరారు.

About The Author