దేవన్‌పల్లి వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
కామారెడ్డి :
కామారెడ్డి పట్టణం దేవన్‌పల్లి పరిధిలోని వార్డ్ నంబర్లు 9, 10, 11, 12, 34, 35 నుంచి భారీ సంఖ్యలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ నీలం చంద్రశేఖర్ తో పాటు బిజెపి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు.రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంక్షేమ పాలనను అందించేది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, రహదారులు, మౌలిక వసతులు, విద్యా-వైద్య రంగాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరడం ఆనందకరమని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని షబ్బీర్ ఆలీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని అన్నారు.కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి కొత్తగా చేరిన ప్రతి కార్యకర్త కృషి కీలకమని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ప్రజల కోసం పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
