సమస్య వుంటే నీ శ్రేయోభిలాషులకు తెలియజేయండి: వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి14: విధి నిర్వహణలో గాని లేదా ఏదైనా వ్యక్తిగత సమస్యలతో ఒత్తిళ్లకు గురౌవుతే నీ శ్రేయోభిలాషులకు లేదా నీ స్నేహితులకు తెలియజేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. విధినిర్వహణతో పాటు వ్యక్తిగతంగా ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను నియంత్రించడం ఎలా అనే అంశంపై అవగాహన సదస్సు శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌లోని రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు పరిపాలన విభాగం అధికారులు సిబ్బంది పాల్గోన్న ఈ సదస్సుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ నిరంతరం విధులు నిర్వహించే పోలీస్‌ ఉద్యోగులకు విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోనాల్సి వుంటుంది. క్రమ శిక్షణ, ప్రణాళికబద్దంగా విధులు నిర్వహించడంతో ద్వారా ఈ ఒత్తిళ్లను అధిగమించవచ్చని. కాని వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసి ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని. కొన్ని సందర్బాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వుంటుందని. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబ రోడ్డున పడుతుందని. ముఖ్యంగా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ గురించి ఆలోచించాలని. ఒత్తిళ్లు అధిగమించేందుకుగాను రోజు కొద్ది సేవు వ్యాయామం లేదా యోగకు సమయాన్ని కేటాయించాలని, మీ భావాలను ఇతరులతో పంచుకోండి, ఆరోగ్యకరమైన అహారపు అలవాట్లు చేసుకోవడంతో పాటు, ఆరోగ్యానికి హానీ కలిగించే అలవాట్లకు దూరంగా వుండాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీసులకు సూచించారు. అంతకుముందుగా నగరానికి చెందిన మనస్తత్వవేత్తలు డా.జ్యోతి, స్వప్న బెన్‌సన్‌లు మానసిక ఒత్తిళ్లను ఏవిధంగా నియంత్రించుకోవాలని పోలీస్‌ సిబ్బంది, అధికారులకు తెలియజేసారు. ఈ కార్యక్రమములో డిసిపిలు షేక్‌ సలీమా, రవీందర్‌, అదనపు డిసిపిలు రవి, సురేష్‌ కుమార్‌, ఏసిపిలు జితేందర్‌,మధసూధన్‌,నాగయ్య,అనంతయ్య, ఏఓ రామకృష్ణతో పాటు ఆర్‌.ఐలు,ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఎస్‌.ఐలు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

సమస్య వుంటే నీ శ్రేయోభిలాషులకు తెలియజేయండి: వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి14:
విధి నిర్వహణలో గాని లేదా ఏదైనా వ్యక్తిగత సమస్యలతో ఒత్తిళ్లకు గురౌవుతే నీ శ్రేయోభిలాషులకు లేదా నీ స్నేహితులకు తెలియజేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. విధినిర్వహణతో పాటు వ్యక్తిగతంగా ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను నియంత్రించడం ఎలా అనే అంశంపై అవగాహన సదస్సు శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌లోని రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు పరిపాలన విభాగం అధికారులు సిబ్బంది పాల్గోన్న ఈ సదస్సుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ నిరంతరం విధులు నిర్వహించే పోలీస్‌ ఉద్యోగులకు విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోనాల్సి వుంటుంది. క్రమ శిక్షణ, ప్రణాళికబద్దంగా విధులు నిర్వహించడంతో ద్వారా ఈ ఒత్తిళ్లను అధిగమించవచ్చని. కాని వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసి ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని. కొన్ని సందర్బాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వుంటుందని. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబ రోడ్డున పడుతుందని. ముఖ్యంగా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ గురించి ఆలోచించాలని. ఒత్తిళ్లు అధిగమించేందుకుగాను రోజు కొద్ది సేవు వ్యాయామం లేదా యోగకు సమయాన్ని కేటాయించాలని, మీ భావాలను ఇతరులతో పంచుకోండి, ఆరోగ్యకరమైన అహారపు అలవాట్లు చేసుకోవడంతో పాటు, ఆరోగ్యానికి హానీ కలిగించే అలవాట్లకు దూరంగా వుండాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీసులకు సూచించారు. అంతకుముందుగా నగరానికి చెందిన మనస్తత్వవేత్తలు డా.జ్యోతి, స్వప్న బెన్‌సన్‌లు మానసిక ఒత్తిళ్లను ఏవిధంగా నియంత్రించుకోవాలని పోలీస్‌ సిబ్బంది, అధికారులకు తెలియజేసారు.
ఈ కార్యక్రమములో డిసిపిలు షేక్‌ సలీమా, రవీందర్‌, అదనపు డిసిపిలు రవి, సురేష్‌ కుమార్‌, ఏసిపిలు జితేందర్‌,మధసూధన్‌,నాగయ్య,అనంతయ్య, ఏఓ రామకృష్ణతో పాటు ఆర్‌.ఐలు,ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఎస్‌.ఐలు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

About The Author