అస్సాం సీఎం పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

అస్సాం సీఎం పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

దుబ్బాక:

జాతీయ దళిత నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారిపై దాడి చేసి చంపేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బీస్వా శర్మ చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలను ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్ హెచ్ ఓ  నాగేశ్వరరావుకు ఫిర్యాదు అందజేసి, అస్సాం సీఎం హిమాంత్ బీస్వా శర్మపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దళితుల గౌరవాన్ని కించపరిచేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పొలిట్‌బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు, సోషల్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాల్వ నరేష్, రాష్ట్ర నాయకులు మండల యాదగిరి, దుబాసి సంజీవ్, బక్కయ్య, రమేష్, ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు నర్మెట ఏసు రెడ్డి, మల్లన్నగుట్ట డైరెక్టర్ బాసం మధు తదితరులు పాల్గొన్నారు.

About The Author