53వ బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలను అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం

53వ బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలను అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం

కామారెడ్డి: 

53వ బాల వైజ్ఞానిక ప్రదర్శిని, ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలను బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అబ్దుల్ కలాం ప్రాంగణం విద్యానికేతన్ హై స్కూల్ నందు అంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం జరిగింది. 

ఇట్టి కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు శ్రీ  మహమ్మద్ అలీ షబ్బీర్, గౌరవ జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్,  ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి, పలువురు నాయకులు అలాగే ఎస్ సి ఆర్ టి డైరెక్టర్ రమేష్, ఆర్జెడి సత్యనారాయణ అతిధులుగా పాల్గొనడం జరిగింది. 

ముందుగా స్వాగతం ఉపన్యాసం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ, గత 15 రోజులుగా 27 కమిటీలలో ఉపాధ్యాయులను ప్రతి కమిటీకి గెజిటెడ్ అధికారిని కన్వీనర్ గా నియమించి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిరంతరం సమీక్షిస్తూ ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులందరూ కూడా సౌకర్యవంతమైన వాతావరణంలో తమ ప్రదర్శనలను ప్రదర్శించి ఉన్నతమైన ప్రదర్శనలను సౌత్ ఇండియా స్థాయికి చేరాలని ఆశీర్వదించడం జరిగింది. 

తదనంతరం జిల్లా సైన్స్ అధికారి సిద్ధరామిరెడ్డి, మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కామారెడ్డిలో జరగడానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ సహాయంతో స్కై వాచ్ క్లబ్బులు ఇస్రో పర్యటనలు ఇన్నోవేషన్ల కొరకు ప్రోత్సాహకాలు వంటి వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని దీని ద్వారా విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల జిజ్ఞాస పెరుగుతుందని తెలిపినారు. అలాగే విద్యాశాఖ తరఫున చేస్తున్న ప్రయత్నాలకు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అందిస్తూ సైన్స్ రంగంలో మన జిల్లా వాసులు ముందుకు వెళ్లడానికి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి  మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించడంలో సైన్స్ ఫెయిర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

    చిన్న వయసులోనే పరిశోధనాత్మక ఆలోచనలు అలవడితే భవిష్యత్తులో దేశ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నమూనాలు ప్రశంసనీయమని, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని తెలిపారు.

 ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణలకు ప్రేరణనిచ్చి, భవిష్యత్తు శాస్త్రవేత్తలను తయారు చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జహీరాబాద్ ఎంపీ శ్రీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ, పూర్వ విద్యా విధానం కన్నా విద్యావ్యవస్థ బలపడాలంటే తప్పక నూతన వరబడెలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలలో సాటిలైట్ టెక్నాలజీ హైడ్రోజన్ ఎనర్జీ వంటి నూతన విధానాలకు ప్రేరణ కల్పించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని అలాంటి ఆవిష్కరణలనే విద్యార్థులు చేసేలా ప్రోత్సహించాలని అప్పుడే నూతన భారతం నిర్మితమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులలో సృజనాత్మకత ప్రతి ఒక్క విద్యార్థుల్లోనూ ఉంటుందని దానిని వెలికి తీసి సరైన మార్గంలో వారికి మార్గ నిర్దేశం చేయడమే సైన్స్ ఉపాధ్యాయులుగా కర్తవ్యమని గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేయడం జరిగింది. 

ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ, తమ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి తన వద్దనే శాఖను ఉంచుకోవడం విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను తెలియపరుస్తుందని తెలియజేశారు. 

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మిడ్ డే మిల్ చార్జీలు 40%, కాస్మెటిక్స్ చార్జీలు 200 శాతం పెంచిందని ఇందుకు తమ సలహాలను గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి మాటలను వేదికకు వినిపించడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షద్వానాలను వ్యక్తపరిచారు. 

తర్వాత మాట్లాడిన పెద్దలు మహమ్మద్ అలీ షబ్బీర్ తన చదువుకున్న పాఠశాల నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలను ఎస్జీఎఫ్ నిధుల నుండి ప్రత్యేకంగా కేటాయించబడినవని వచ్చే విద్యా సంవత్సరానికల్లా నూతన ప్రాంగణాన్ని బాలుర ఉన్నత పాఠశాల కామారెడ్డి నందు నిర్వహించుకోబోతున్నామని తెలియజేసారు. 

అలాగే తన జన్మస్థలమైనటువంటి మాచారెడ్డి మండలం నుండి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కేవలం విద్యా రంగంలోనే కాక సహ పాఠ్యాంశ కార్యక్రమాలలో ముఖ్యంగా నృత్య ప్రదర్శనలలో బంజారా నృత్య ప్రదర్శనను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో జరిపిన కృషి అభినందనీయమని అందుకు మాచారెడ్డి వాసిగా తాను గర్విస్తున్నానని తెలియజేసారు.

అంతేకాక రాబోయే రోజుల్లో విద్యాశాఖ చేపట్టే ఏ కార్యక్రమానికైనా తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని విద్యార్థులలో నూతన వరవడిని పెంచే విధంగా విద్యాశాఖ కార్యక్రమాలు చేపట్టాలని సూచించడం జరిగింది.

About The Author

Related Posts