ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 2 నుండి 2026 ఫిబ్రవరి 21 వరకు

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 2 నుండి 2026 ఫిబ్రవరి 21 వరకు

కామారెడ్డి జిల్లా :

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026
(సాధారణ & ఒకేషనల్ కోర్సులు)
మార్చి–2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (I & II సంవత్సరం) కు సంబంధించి ప్రాక్టికల్, థియరీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 
ప్రాక్టికల్ పరీక్షలు
ఒకేషనల్ కోర్సులలో II సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు
02-02-2026 నుండి 21-02-2026 వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

పరీక్షా సమయాలు :
ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు (ఎఫ్ ఎన్ సెషన్)
మధ్యాహ్నం 2.00 నుండి 5.00 గంటల వరకు (ఎఎన్ సెషన్)
మొత్తం ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు : 4,363
ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల సంఖ్య : 35
ప్రభుత్వ కళాశాలలు : 18
ప్రభుత్వ రంగం : 7
ప్రైవేట్ కళాశాలలు : 10
ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలకు సంబంధిత జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.
థియరీ పరీక్షలు
25-02-2026 నుండి 18-03-2026 వరకు
కామారెడ్డి జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలలో థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్ష సమయం :
ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు
పరీక్షా కేంద్రాల వివరాలు :
మొత్తం కేంద్రాలు : 37
ప్రభుత్వ కళాశాలలు : 21
ప్రభుత్వ రంగం : 6
ప్రైవేట్ కళాశాలలు : 10
విద్యార్థుల సంఖ్య :
I సంవత్సరం : 9,013
II సంవత్సరం : 8,926
మొత్తం : 17,939
పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు
మార్చి–2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం
సెక్రటరీ, టీఎస్ బీఐఈ, హైదరాబాద్ ద్వారా
ఒక సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్
ఒక సీనియర్ లెక్చరర్‌తో కూడిన జిల్లా పరీక్షా కమిటీని నియమించనున్నట్లు తెలిపారు.
టీఎస్ బీఐఈ మార్గదర్శకాల ప్రకారం, థియరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులను నియమించడం జరిగిందన్నారు.
ఇతర సౌకర్యాలు
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ (02-02-2026 నుండి 21-02-2026 వరకు) కోసం :
విద్యార్థులకు వారి సంబంధిత కళాశాలల నుండి పరీక్షా కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు
ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు
మధ్యాహ్నం 12.00 నుండి 2.00 గంటల వరకు
టిఎస్ఆర్ టీసీ రీజనల్ మేనేజర్‌ను ఆదేశించారు.
ప్రాక్టికల్ పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల డౌన్‌లోడ్ మరియు ఆన్‌లైన్ మార్కుల అప్‌లోడ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా
02-02-2026 నుండి 21-02-2026 వరకు ఉదయం 7.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను ఆదేశించారు.

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకుని, పరీక్షా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

About The Author

Related Posts