ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి
కడప, ఫిబ్రవరి 14(భారత శక్తి ) : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.. డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప నగర కమీషనర్ మనోజ్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం కోర్సులకు సంబంధించి మార్చి 1వ తేదీ నుండి మార్చీ 20వ తేదీ వరకు పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుండి 12 వరకు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 64 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. అన్ని ప్రయివేటు కళాశాలలను సెన్సిటీవ్ కేంద్రాలుగా గుర్తించి ఆయా కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను అమర్చడం జరుగుతుందన్నారు. ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయాలనీ పోలీస్, రెవిన్యూ అధికారులకు సూచించారు. పరీక్ష ప్రారంభానికి అర్ధ గంట ముందు నుండి పరీక్ష పూర్తయ్యే వరకు విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయాలని, విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్ష సమయాల్లో విద్యార్ధులకు రవాణా వ్యవస్థ అనుకూలంగా ఉండేలా ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో బస్సులను అన్ని రూట్లలో నడపాలని, పరీక్ష పూర్తి అయ్యాక కూడా బస్సు సౌకర్యం ఉండేలా చూడాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. ఆ సమయాల్లో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. మాస్ కాపీయింగ్ కు పాల్పడే అవకాశాలు ఎక్కడా లేకుండా జాగ్రత్త వహించాలని, ఈ విషయంలో కళాశాలల యాజమాన్యం, సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. ఏ చిన్నపాటి పొరపాట్లు జరిగినా సంబంధిత బాద్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తాగు నీటిని ఏర్పాటు చేయాలనీ మున్సిపల్ అధికారులకు, అత్యవసర మందులతో పాటు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకుని ప్రధమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆర్.ఐ.ఓ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఈ పరీక్షల కోసం 3 ఫ్లైయింగ్, 5 పెయిర్ల సిట్టింగ్ స్క్వాడ్లను, 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్టుమెంటల్ అధికారులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను పూర్తిగా మూసి వేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. పరీక్షల నిర్వహణకు రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారం ఎంతైనా అవసరం అని, అందుకోసం సంబందిత శాఖల అధికారులు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో విద్యాశాఖ, పోలీస్, ఏపీఎస్ ఆర్.టి.సి, విద్యుత్, వైద్య శాఖల అధికారులు పరీక్షల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కడప, ఫిబ్రవరి 14(భారత శక్తి ) : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.. డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప నగర కమీషనర్ మనోజ్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం కోర్సులకు సంబంధించి మార్చి 1వ తేదీ నుండి మార్చీ 20వ తేదీ వరకు పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుండి 12 వరకు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
పరీక్ష ప్రారంభానికి అర్ధ గంట ముందు నుండి పరీక్ష పూర్తయ్యే వరకు విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయాలని, విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్ష సమయాల్లో విద్యార్ధులకు రవాణా వ్యవస్థ అనుకూలంగా ఉండేలా ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో బస్సులను అన్ని రూట్లలో నడపాలని, పరీక్ష పూర్తి అయ్యాక కూడా బస్సు సౌకర్యం ఉండేలా చూడాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. ఆ సమయాల్లో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. మాస్ కాపీయింగ్ కు పాల్పడే అవకాశాలు ఎక్కడా లేకుండా జాగ్రత్త వహించాలని, ఈ విషయంలో కళాశాలల యాజమాన్యం, సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. ఏ చిన్నపాటి పొరపాట్లు జరిగినా సంబంధిత బాద్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆర్.ఐ.ఓ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఈ పరీక్షల కోసం 3 ఫ్లైయింగ్, 5 పెయిర్ల సిట్టింగ్ స్క్వాడ్లను, 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్టుమెంటల్ అధికారులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను పూర్తిగా మూసి వేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. పరీక్షల నిర్వహణకు రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారం ఎంతైనా అవసరం అని, అందుకోసం సంబందిత శాఖల అధికారులు సహకరించాలని ఆయన కోరారు.
సమావేశంలో విద్యాశాఖ, పోలీస్, ఏపీఎస్ ఆర్.టి.సి, విద్యుత్, వైద్య శాఖల అధికారులు పరీక్షల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
