
కామారెడ్డి జిల్లా :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి, విమెన్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (డబ్ల్యూ ఓ ఆర్ డి) ఎన్జీఓ సంయుక్త ఆధ్వర్యం లో అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్బంగా నేడు జిల్లా కోర్టు సముదాయంనుండి ఒక అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ సిహెచ్.వి.ఆర్.ఆర్. వరప్రసాద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఛైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి,అయన మాట్లాడుతూ “మహిళలపై హింస నిర్మూలన కోసం ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ మరియు సమాజం మొత్తం బాధ్యతతో ముందుకు రావాలి. హింసకు గురైన ప్రతి మహిళ న్యాయ సహాయం పొందేలా న్యాయ సేవా సంస్థలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. చట్టపరమైన రక్షణతో పాటు సామాజిక అవగాహన పెరిగినప్పుడే మహిళలపై హింస పూర్తిగా తగ్గుతుంది” అని తెలిపారు. పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ ర్యాలీ కార్యక్రమాన్ని కార్యదర్శి ఎమ్ఎస్.టి. నాగరాణి అందరిని సమన్వయము చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె కార్యక్రమ నిర్వహణలో సక్రమ పర్యవేక్షణ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి డాక్టర్ సుమలత, జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి శ్రీ కె. సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి శ్రీమతి దీక్షా, డబ్య్లూఓ ఆర్ డి మానిటరింగ్ కోఆర్డినేటర్ సోలంకీ రాణి, రమేష్, వారి సిబ్బంది, కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్, కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డి,డబ్య్లూ, ఓ సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్, కామారెడ్డి టౌన్ సీఐ నరేష్, అడ్వకేట్ శాబానా బేగం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్, కామారెడ్డి జిల్లా కోర్టు పరిపాలన అధికారి మంథ్య, సూపరింటెండెంట్లు జే. భుజంగరావు, వెంకట్ రెడ్డి, డిఎల్ఎస్ఎ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, డిఎల్ఎస్ఎ సిబ్బంది, ఎన్జీఓలు, పారా లీగల్ వాలంటీర్లు, కమ్యూనిటీ మిడియేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు.