వ్యాపారస్తులు లైసెన్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్


వ్యాపారస్తులు లైసెన్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్

భద్రాచలం :

భద్రాచలం పరిసర ప్రాంతాలలో పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ వ్యాపారాన్ని బట్టి లైసెన్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. గురువారం  ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో ఐటీడీఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో భద్రాచలం, పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులకు లైసెన్స్  రిజిస్ట్రేషన్ మేళ కార్యక్రమానికి ఆయన హాజరై వ్యాపారస్తులకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ కాపీలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో అన్ని ఆహార వస్తువులు అమ్మకాలు చేసుకుంటున్నా వ్యాపారస్తులు, రెస్టారెంట్ నుండి మొదలుకొని బేకరీస్, ఫుడ్ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, చిన్న బడ్డీ కోట్లు, పానీ పూరి సెంటర్లు, కూరగాయల వ్యాపారస్తులు అందరూ తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని, చిన్న వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ విధంగా చేసుకున్న వ్యాపారస్తులకు వారు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి లభించినట్లేనని, ఎఫ్ఎస్ఎస్ఐ ద్వారా ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ మంజూరు అవుతుందని తెలిపారు. వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్, లైసెన్సు కలిగిన వారికి వ్యక్తిగతంగా రుణాలు పొందడానికి అవకాశం కలుగుతుందన్నారు. లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేసుకుంటే సేఫ్టీ ఆఫీసర్లు మీరు తయారు చేస్తున్న ఆహార పదార్థాలు తనిఖీ చేసినప్పుడు తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందుకు ప్రతి వ్యాపారస్తుడు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని, లైసెన్సులు పూర్తికాగానే డైరెక్ట్ గా మీ ఫోన్ కు మెసేజ్ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్, సిబ్బంది వివిధ వ్యాపారానికి సంబంధించిన యజమానులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts