
సంగారెడ్డి :
కార్తీక పౌర్ణమి రోజున పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలో కురుమ గొల్ల యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదరు ఉత్సవాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొని గొల్ల కురుమలతో ఆడి పాడారు. ఈ సందర్భంగా 18 దున్న పోతుల విన్యాసాలను ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ... సదర్ సమ్మేళనాలను వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కుర్మ యాదవులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. గొల్ల కురుమల తరఫున చర్యాల ఆంజనేయులును సుడా చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహకు చెప్పడం జరిగిందన్నారు. గత దసరా ఉత్సవాల్లో కూడా సంతోష్ ను చైర్మన్ చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. ప్రదీప్ శ్రీశైలం బాలు నాగు ప్రశాంత్ ఒగ్గు సతీష్ లకు రాజకీయంగాఅవకాశాలుంటాయని భరోసా కల్పించారు. నేను మీ జగ్గారెడ్డి నేనని పులి సింహం అని పిలవకండి అని సూచించారు. గొల్ల కురుమల తో పాటు ప్రతి ఒక్కరు సదరు ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. సదర్ ఉత్సవాలను చూస్తుంటే ఆనందం వేస్తుందని పేర్కొంటూ కృష్ణుడి పాట పాడి అలరించారు. అనంతరం దున్నపోతుపై నిలబడి యాదవులతో కలిసి జగ్గారెడ్డి తీన్మార్ స్టెప్పులు వేశారు. కార్యక్రమంలో గొల్ల కురుమ నాయకులు యువకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.