
సంగారెడ్డి :
సంగారెడ్డి పట్టణంలో కార్తీక పౌర్ణమి వేడుకలను బుధవారం సాయంత్రం స్థానిక రామ్ మందిర్ లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక దీపోత్సవం కార్యక్రమంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో నిర్వాహకులతో కలిసి జగ్గారెడ్డి ప్రత్యేక దీపాలంకరణ కార్యక్రమంలో దీపాలు వెలిగించారు. దీపాల కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోయింది. భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి పట్టణ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలలో పాల్గొనడం పై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నిర్వాహకులు పట్టణ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.