ఎర్దనూరు చౌడమ్మ జాతరలో పాల్గొన్న జగ్గారెడ్డి
- చౌడమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగ్గారెడ్డి
- చౌడమ్మ తల్లికి సంబంధించిన విశేషాల గురించి ఒగ్గు కళాకారులు పాడిన పాటలు విన్న జగ్గారెడ్డి
సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూరు గ్రామంలో జరిగిన శ్రీ చౌడమ్మ తల్లి జాతర ఉత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. చౌడమ్మ తల్లి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చౌడమ్మ తల్లి చరిత్ర గురించిన విశేషాలను వివరిస్తూ, ఒగ్గు కళాకారులు పాడిన పాటలను విన్నారు. ఎర్దనూరు గుట్టపైన కొలువైన దేవతామూర్తులను దర్శించుకున్నారు. చౌడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘుగౌడ్, ఎర్దనూరు సర్పంచ్ పంబళ్ల జ్యోతి దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు..jpeg)
