గణితంలో కల్లెం శ్రీనివాసరెడ్డికి పీహెచ్డీ

సంగారెడ్డి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి శ్రీనివాసరెడ్డి కల్లెం డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘రంధ్రాల మాధ్యమంలో సాగే ఉపరితలంపై హైపర్ బోలిక్ టాంజెంట్ నానోఫ్లూయిడ్ ప్రవాహంలో ఉష్ణ, ద్రవ్యరాశి బదిలీ యొక్క గణన విశ్లేషణ’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివారెడ్డి శేరి గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి పరిశోధన మాగ్నెటో హైడ్రో డైనమిక్ ప్రభావాలు, ఉష్ణ బదిలీ ప్రవర్తన, అయస్కాంత క్షేత్ర ప్రభావం, నానోఫ్లూయిడ్ డైనమిక్స్ ను విశ్లేషించడానికి మ్యాట్ ల్యాబ్ యొక్క బీవీపీ4సీ ఫ్రేమ్ వర్కును ఉపయోగిస్తుందని వివరించారు. నాన్ లీనియర్ డిఫరెన్షియల్ సమీకరణాల సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఆయన కృషి చేసినట్టు తెలిపారు.ఈ పరిశోధనలు అణు రియాక్టర్ శీతలీకరణ, లోహశాస్త్రం, భౌగోళిక భౌతిక ప్రక్రియలు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వంటి అధునాతన శాస్త్రీయ, పారిశ్రామిక రంగాలలో వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇవి థర్మో-ఫ్లూయిడ్ వ్యవస్థల మెరుగైన రూపకల్పన, ఆప్టిమైజేషన్ కు దోహదపడతాయన్నారు.
డాక్టర్ శ్రీనివాసరెడ్డి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ – గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
