ఖమ్మం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సునీల్ దత్ ఐపిఎస్ ఖమ్మం
ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా సునీల్ దత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సి పి విష్ణు యస్. వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు మర్యాదపూర్వంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. 2014 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ దత్ ప్రస్తుతం హైద్రాబాద్ సిటీ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా విధులు నిర్వర్తిస్తూ ఖమ్మం సీపీగా బదిలీ అయ్యారు. గతంలో భద్రాచలం ఏఎస్పీగా, జాగిత్యాల ఏస్పీగా, భద్రాద్రికొత్తగూడెం ఎస్పీగా పనిచేశారు. 2022 జులై నెలలో హైద్రాబాద్ డీసీపీగా బదిలీపై వెళ్ళారు. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.