సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం
- బోనకల్ ఎస్సై పొదిల వెంకన్న

ఖమ్మం బ్యూరో :
డీజే సిస్టంకు ఎలాంటి అనుమతులు లేవు డీజే యజమానులు గమనించగలరు డీజేలపై కేసులు నమోదు చేయబడుతాయనీ బోనకల్ ఎస్సై పోదిల వెంకన్న తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....మండలంలోని కొంతమంది ప్రజలు గ్రామపంచాయతీ ఎలక్షన్స్ నుండి ఇంకా బయటకు రాలేదు కాబట్టి ఈ వేడుకల సందర్భంగా ఏమైనా చిన్న చిన్న గొడవలు జరిగి గ్రూపు మధ్య తగాదాలుగా మారితే వాళ్లతో పాటు ఆ కార్యక్రమం ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్లపై ఖచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మండల పరిధిలో స్థానిక పోలీసులతో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకల పేరుతో జరిగే కార్యక్రమాల వల్ల పరిసర ప్రాంతాల్లోని ఇండ్లవారికి ఇబ్బందులు కలగకుడదు వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రధానంగా ఈ వేడుకల వేళ యువకులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానతో పాటు జైలు శిక్ష విధించబడుతుందన్నారు. అలాగే వేగంగా వాహనాలు నడపడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవని, సమస్యలు రాకుండా స్థానిక పోలీసుల అధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనీఖీలు నిర్వహించబడుతాయని సూచించారు. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడుతుందన్నారు. పై అంక్షలను ఎవరైన అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కల్సి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని బోనకల్ ఎస్సై మండల ప్రజలకు సూచించారు.
