రైతులకు మేలు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
తొగుట మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట:
రైతులకు మేలు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, రైతులు పండించిన సన్నరకం వరి ధాన్యానికి అదనంగా క్వింటాల్ కి రూ. 500 బోనస్ అందిస్తుందని, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని లింగాపూర్, ఎల్ బంజరపల్లి, జప్తి లింగారెడ్డి పల్లి, చందపూర్, ఎల్లారెడ్డిపేట, పెద్ద మాసంపల్లి, బండారుపల్లి, ఘణపురం తుక్కాపూర్, వెంకట్రావుపేట, గుడికందుల, వరదరాజుపల్లి, గోవర్ధనగిరి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి లతా నరేందర్ రెడ్డి ఆయా గ్రామ సర్పంచులు, ఏపీఎం ఏపీఎం బాబురావు, ఏవో మోహన్ లతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లకు సరైన ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయిస్తే రైతులకు అధిక లాభం చేకూరుతుందని వివరించారు. రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పంటను తీసుకురావాలని సూచించారు. అలాగే కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, కోఆపరేటివ్ సెక్రటరీ గంగరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
