రాష్ట్రస్థాయి కరాటే పోటిల్లో మానేరు విద్యార్థులకు పతకాలు: మానేరు చైర్మన్‌ అనంతరెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 17(భారత శక్తి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తొలి రాష్ట్రస్థాయి ఆల్‌ స్టైల్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే పోటీల్లో కరీంనగర్‌ పద్మనగర్‌లోని మానేరు సీబీఎస్‌ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. పోటిల్లో పాఠశాల నుంచి 5 గురు విద్యార్థులు పాల్గొనగా టీం ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ తో పాటు ఆర్‌ నిక్సిత్, ఎన్‌ ప్రకాశ్, కె వికాస్‌లు బంగారు, ఐ రాంతేజ, టీ మహావీర్‌లు కాంస్య పతకాలను కైవసం చేసుకొన్నారు. సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్‌ ఆర్ట్స్‌ లో రాణించిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. ఆత్మరక్షణకు, ఆత్మస్థైర్యానికి కరాటే క్రీడ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో జాతీయ పోటిల్లో బంగారు పతకాలు సాధించి తెలంగాణకు, జిల్లాకు, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను విద్యాసంస్థల డైరెక్టర్‌ కడారి సునీతా రెడ్డి, ప్రిన్సిపల్‌లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు.

రాష్ట్రస్థాయి కరాటే పోటిల్లో మానేరు విద్యార్థులకు పతకాలు: మానేరు చైర్మన్‌ అనంతరెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 17(భారత శక్తి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తొలి రాష్ట్రస్థాయి ఆల్‌ స్టైల్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే పోటీల్లో కరీంనగర్‌ పద్మనగర్‌లోని మానేరు సీబీఎస్‌ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. పోటిల్లో పాఠశాల నుంచి 5 గురు విద్యార్థులు పాల్గొనగా టీం ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ తో పాటు ఆర్‌ నిక్సిత్, ఎన్‌ ప్రకాశ్, కె వికాస్‌లు బంగారు, ఐ రాంతేజ, టీ మహావీర్‌లు కాంస్య పతకాలను కైవసం చేసుకొన్నారు. సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్‌ ఆర్ట్స్‌ లో రాణించిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. ఆత్మరక్షణకు, ఆత్మస్థైర్యానికి కరాటే క్రీడ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో జాతీయ పోటిల్లో బంగారు పతకాలు సాధించి తెలంగాణకు, జిల్లాకు, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను విద్యాసంస్థల డైరెక్టర్‌ కడారి సునీతా రెడ్డి, ప్రిన్సిపల్‌లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు.

About The Author