చిన్ననాటి నుంచే విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అవసరం
- - కాకతీయ హైస్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
- బి-స్మార్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి
సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి-స్మార్ట్ (బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా జగ్గు మల్లారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రైమరీ విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అందజేయడం ద్వారా వారికి ప్రోత్సాహం కలిగించడంతో పాటు గుర్తింపును ఇవ్వడం సంతోషకరమని తెలిపారు.
చిన్ననాటి నుంచే విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని, పురాణ ఇతిహాసాలను పరిచయం చేస్తూ మహనీయుల అడుగుజాడల్లో నడిపించాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించారు. చదివిన పాఠశాలకు, విద్య నేర్పిన గురువులకు కీర్తి తీసుకురావాలని విద్యార్థులకు ఉద్బోధించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కవిత,ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..jpeg)
