అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమావేశం
- పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :
భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయిన పనుల శంకుస్థాపనల పై మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక చర్యలు తీసుకొని ఆసుపత్రి ఆవారా cc వేయాలని ,డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు సమన్వయంతో పని చేసి మున్సిపాల్టీ అభివృద్ధి కి చర్యలు చేపట్టాలని ప్రతి పనికి ఒక టైం లైన్ ను నిర్దేశించి ఒక అధికారిణి నియమించాలని నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్ ల పై చర్యలు తిసుకుంటమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
