
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
సోమవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కెమికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 మరియు pc & pndt act పై సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ గారు మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నియమ నిబంధనలను మరియు పిసిపి ఎన్డిటి నిబంధనలను అందరు వైద్యులు పాటించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో రోగులకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించాలని, సర్వీస్ చార్జెస్ లిస్ట్ ప్రదర్శించాలని, ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుల పేర్లు అందిస్తున్న సేవలను తెలపాలని తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా ఫైర్ సేఫ్టీ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ,బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని తెలియజేయడం జరిగింది.
ఈ సమావేశంలో కార్యక్రమ నిర్వహణ అధికారులు డాక్టర్స్ నయనా రెడ్డి ,సౌమ్య, ప్రత్యూష, ఆశిష్ రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మురళీధర్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ రామచంద్ర రెడ్డి, స్టేట్ సెక్రటరీ డాక్టర్ రామకృష్ణ, డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్ జిల్లాలోని ప్రైవేట్ వైద్యులు మరియు కరస్పాండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.