తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా క్రికెట్ సంఘం సభ్యులు
సంగారెడ్డి:
సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అధ్యక్షుడు తలాటం హరీష్ ను మంగళవారం సంగారెడ్డి జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కాకినాడ పట్టణంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లా క్రీకెట్ సంఘం నాయకులు చెన్నంశెట్టి పార్థసారథి, పినిశెట్టి రాంబాబులు, తలాటం హరీష్ ను ఘనంగా సన్మానించి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్రికెట్ కోచ్లు చార్లీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
