సంగారెడ్డి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి :
నూతన సంవత్సరం సందర్భంగా సంగారెడ్డి జిల్లా, నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజల సహకారం, ఆశీర్వాదాలతో సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.కొత్త సంవత్సరం సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభప్రదంగా, విజయవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
