ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 04: నిర్మల్ కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో నోడల్ అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 16809 మంది పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటర్లు, 1944 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 31 పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు తెలిపారు. ఓటు వేసేటప్పుడు పాటించవలసిన నియమాలపై ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ, నమూనా ఓటింగ్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నోడల్ అధికారులందరికి వారు నిర్వహించే విధులను వివరించారు. అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, పోలింగ్ కేంద్రాల్లో గల వసతులను ధ్రువీకరించి, అవసరమైన చోట తగు వసతులను కల్పించాలన్నారు. ఓటింగ్ కోసం నమోదు చేసుకున్న ప్రతి ఒక్క ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు వచ్చే ఓటింగ్ సామాగ్రిని భద్రపరిచేందుకై తగు ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఆర్డీవో కార్యాలయంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు వినియోగ విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగేలా విస్తృతంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్, 10 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 27 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 3 వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామన్ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించినట్లు తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఏఆర్వో, పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని పార్టీలు తప్పనిసరి పాటించాలన్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయబోయే వారి కోసం అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు గోవింద్, శ్రీనివాస్, కిరణ్ కుమార్, సందీప్, దుర్గాప్రసాద్, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్ రెడ్డి, గాజుల రవి గండ్రత్ రమేష్, సిరికొండ రమేష్, నరేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 04: నిర్మల్ కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో నోడల్ అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 16809 మంది పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటర్లు, 1944 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 31 పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు తెలిపారు. ఓటు వేసేటప్పుడు పాటించవలసిన నియమాలపై ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ, నమూనా ఓటింగ్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నోడల్ అధికారులందరికి వారు నిర్వహించే విధులను వివరించారు. అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, పోలింగ్ కేంద్రాల్లో గల వసతులను ధ్రువీకరించి, అవసరమైన చోట తగు వసతులను కల్పించాలన్నారు. ఓటింగ్ కోసం నమోదు చేసుకున్న ప్రతి ఒక్క ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు వచ్చే ఓటింగ్ సామాగ్రిని భద్రపరిచేందుకై తగు ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఆర్డీవో కార్యాలయంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు వినియోగ విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగేలా విస్తృతంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్, 10 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 27 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 3 వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామన్ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించినట్లు తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఏఆర్వో, పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని పార్టీలు తప్పనిసరి పాటించాలన్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయబోయే వారి కోసం అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు గోవింద్, శ్రీనివాస్, కిరణ్ కుమార్, సందీప్, దుర్గాప్రసాద్, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్ రెడ్డి, గాజుల రవి గండ్రత్ రమేష్, సిరికొండ రమేష్, నరేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
