సంక్రాంతి సందర్భంగా మధుర నగర్‌లో ముగ్గుల పోటీలు
- ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి:
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం 33వ వార్డు మధుర నగర్‌లో మాజీ కౌన్సిలర్ మురళీధర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రద్దు చేసి, కొత్తగా నిధులు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.ముగ్గుల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి అనూషకు రూ.5,000, రెండో బహుమతి జ్యోతికి రూ.3,000, మూడో బహుమతి పద్మకు రూ.2,000 అందజేశారు.ఈ సందర్భంగా వార్డులోని పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రోడ్డు వసతుల కల్పనను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, వార్డు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ ఛైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్. వెంకటేశ్వర్లు, ప్రభాకర్, శ్రవణ్, మొగులయ్య, రాఘవేందర్ రెడ్డి, నాగరాజ్ గౌడ్, మోహన్, ప్రవీణ్, రమణ రెడ్డి, నరసింహ చారి, శ్రీనివాస్ రావు, శంకర్ చారి, గౌరీ, కృష్ణవేణి, పద్మ, మాదవి, శోభా, అక్షయ్, జలందర్, నరేష్, అఖిల్, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
