జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు..
- ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూల్స్ లో విద్యార్థులకు రోడ్డు భధ్రత పై అవగాహన..

కామారెడ్డి జిల్లా :
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్బంగా తేదీ 01-01-2026 నాడు జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూల్స్ లో విద్యార్థులకు రోడ్డు భధ్రత పై అవగాహన కల్పించడం జరిగింది. రహదారి నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ యొక్క ప్రాముఖ్యత, ఉపయోగం గురించి వివరించడం, రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో మోటార్ వాహన తనిఖీ అధికారులు, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.
