భైంసా ప్రయాణ ప్రాంగణంలో నూతన సంవత్సర సందడి.

WhatsApp Image 2026-01-01 at 6.06.02 PM

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : 

భైంసా ప్రయాణ ప్రాంగణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు రంగురంగుల అలంకరణలతో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచాయి. భైంసా బస్సు స్టేషన్‌లోని టీఎస్‌ఆర్టీసీ బస్సు కంట్రోలర్ కార్యాలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల అలంకరణలు ప్రయాణికుల దృష్టిని ఆకర్షించాయి.

డిపో మేనేజర్ జి. హరిప్రసాద్ ఆధ్వర్యంలో, సిబ్బంది సమిష్టి కృషితో ఈ వినూత్న ఏర్పాట్లు చేశారు. పూలు, రంగులతో ఆకర్షణీయంగా రూపొందించిన నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాలు ఎప్పుడూ లేనివిధంగా ప్రత్యేకంగా ఉండటంతో ప్రయాణికులు ఉత్సాహంగా స్పందించారు.

బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు అలంకరణలను తిలకిస్తూ సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఈ ప్రత్యేక ఏర్పాట్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డిపో మేనేజర్ జి. హరిప్రసాద్ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు భైంసా ప్రయాణ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

About The Author