జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు.

WhatsApp Image 2026-01-01 at 6.09.09 PM

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : 

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు, నూతన సంవత్సరం సందర్భంగా గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. 
   
ఈ సందర్భంగా కలెక్టర్ కు నోటు పుస్తకాలు, పూల మొక్కలు, పుష్ప గుచ్చాలను అందించారు. మిఠాయిలు తినిపించి, కేకులు కట్ చేశారు. పలు శాఖల, ఉద్యోగ సంఘాలకు చెందిన డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.
   
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులకు ఉద్యోగులకు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సరం ఉద్యోగులందరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, జిల్లా ప్రగతిలో కీలక ప్రాత్ర పోషించారని తెలిపారు. ఈ ఏడాదిలో కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ, జిల్లాను అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంచాలని పేర్కొన్నారు. 
    
కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ తో పాటు, రెవెన్యూ, పంచాయతీ, జిల్లా పరిషత్, విద్య, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ, ఖజానా, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక, పౌర సరఫరాల, యువజన క్రీడల, భూ కొలతల శాఖల అధికారులు, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About The Author