ఓటమి భయంతో ప్రతిపక్షాలు విష ప్రచారం: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 14(భారత శక్తి) : రానున్న కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఓటమిని ముందే అంగీకరించాయని ఆ భయంతోనే తనపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా విష ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.శుక్రవారం జగిత్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ధర్మపురి, జగిత్యాల,కోరుట్ల, నియోజకవర్గాల్లో పట్టభద్రులు కాంగ్రెస్ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు రిహాల్సర్ లాంటివని కాంగ్రెస్ శ్రేణులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా ఉండి వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానని, అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలు ప్రకటించి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించిందని అన్నారు.ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా చేసే విష ప్రచారాలను తిప్పికొట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి ప్రతి పట్టభద్రుని కలిసి వివరించాలని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగ రావు పలువురు మండల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ లు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.