బడ్జెట్ పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి
కరీంనగర్, జనవరి 1(భారత శక్తి): కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ అని, మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమని, ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్ ఎన్నడూ రాలేదని సంస్కరణల బడ్జెట్ అన్నారు. 2027నాటికి అమెరికా, చైనా తరువాత భారత్ ను మూడో ఆర్ధిక వ్యవస్థగా అవతరించే దిశగానే ఈ బడ్జెట్ ను రూపొందించడం గొప్ప పరిణామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిదన్నారు. కేన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు వాడుతున్న ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంవల్ల ఆయా రోగాలకు చికిత్స వ్యయం చాలా వరకు తగ్గే అవకాశముందని, ఆర్ధిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంతోపాటు వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలను బ్యాలెన్స్ చేసే బడ్జెట్ ఇదని గుర్తుచేశారు. వ్యాపారస్తుల, దళారుల వద్ద చేయిచాపే దుస్థితి లేకుండా చేసేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారని చెప్పారు. ఉపాధి అవకాశాలను పెంచి యువతను వ్యాపార, పారిశ్రామికవేత్తలను చేసేందుకు బడ్జెట్ లో వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, రుణ పరిమితిని పెంచడం ఆహ్వానించదగ్గర పరిణామనీ చెప్పారు. విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ప్రజలకు చౌక ధరకే కరెంట్ ను అందుబాటులోకి తెచ్చే విధంగా బడ్జెట్ ను రూపొందించడం గొప్ప విషయమన్నారు. గ్రామాల్లో వలసలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలను బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ పట్టణాలను అన్ని విధాలా అభివ్రుద్ధి చేసేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయింపులు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ (2025-26) దేశ గతిని మర్చబోతుందని, దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్ అన్నట్లుగా… ఈ దేశంలోని 90 శాతం పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను, అభివ్రుద్ధిని కాంక్షిస్తూ రూపొందించిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని మంత్రి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కరీంనగర్, జనవరి 1(భారత శక్తి):
కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ అని, మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమని, ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్ ఎన్నడూ రాలేదని
సంస్కరణల బడ్జెట్ అన్నారు. 2027నాటికి అమెరికా, చైనా తరువాత భారత్ ను మూడో ఆర్ధిక వ్యవస్థగా అవతరించే దిశగానే ఈ బడ్జెట్ ను రూపొందించడం గొప్ప పరిణామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిదన్నారు.
కేన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు వాడుతున్న ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంవల్ల ఆయా రోగాలకు చికిత్స వ్యయం చాలా వరకు తగ్గే అవకాశముందని, ఆర్ధిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంతోపాటు వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలను బ్యాలెన్స్ చేసే బడ్జెట్ ఇదని గుర్తుచేశారు. వ్యాపారస్తుల, దళారుల వద్ద చేయిచాపే దుస్థితి లేకుండా చేసేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారని చెప్పారు.
ఉపాధి అవకాశాలను పెంచి యువతను వ్యాపార, పారిశ్రామికవేత్తలను చేసేందుకు బడ్జెట్ లో వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, రుణ పరిమితిని పెంచడం ఆహ్వానించదగ్గర పరిణామనీ చెప్పారు. విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ప్రజలకు చౌక ధరకే కరెంట్ ను అందుబాటులోకి తెచ్చే విధంగా బడ్జెట్ ను రూపొందించడం గొప్ప విషయమన్నారు. గ్రామాల్లో వలసలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలను బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ పట్టణాలను అన్ని విధాలా అభివ్రుద్ధి చేసేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయింపులు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ (2025-26) దేశ గతిని మర్చబోతుందని, దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్ అన్నట్లుగా… ఈ దేశంలోని 90 శాతం పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను, అభివ్రుద్ధిని కాంక్షిస్తూ రూపొందించిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని మంత్రి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
