ఓవర్‌ టూ ఢల్లీి…

హైదరాబాద్‌, జూన్‌ 27 : ఢల్లీి సెంట్రిక్‌గానే ఇప్పుడు తెలంగాణ రాజకీయం నడుస్తోంది. అటు కాంగ్రెస్‌ నేతలంతా ఢల్లీి బాట పడుతుంటే.. ఇటు బీజేపీ నేతలు కూడా హస్తినలోనే మకాం వేశారు. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ పరిస్థితులపై ఫోకస్‌ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ముఖ్య నేతలతో భేటీ అవుతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బండికి ఢల్లీి నుంచి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ నేతలతో బీజేపీ జాతీయ నాయకత్వం వరుసగా జరుపుతున్న చర్చల వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి..?తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిరచాలని చూస్తున్న బీజేపీ క్రమక్రమంగా స్పీడ్‌ పెంచుతోంది. ఈ క్రమంలోనే కీలక నేతలను ఢల్లీికి పిలిపించుకుని చర్చలు జరుగుతోంది జాతీయ నాయకత్వం. ఇటీవలే ఈటెల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. రాష్ట్ర రాజాకీయాల్లో తాజా పరిస్థితులపై చర్చించారు. ఇరువురి నాయకుల వెర్షన్‌ ఏమిటనేది క్లియర్‌గా విన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢల్లీి నుంచి బండికి పిలుపు వచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ కూడా హుటాహుటిన ఢల్లీి పెద్దలను కలిసేందుకు హస్తినకు బయలుదేరారు.కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీలో జరిగిన పలు అనూహ్య పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయనే చర్చలు ఉన్నాయి. కమల నేతల వివాదాస్పద కామెంట్లు, నాయకుల తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయనే వాదన కూడా లేకపోలేదు. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే దక్షిణాదిలో పాగా వేయడం కష్టమేనని బీజేపీ హైకమాండ్‌ భావించి నేతలతో ఈ సవిూక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పార్టీలోని అసంతృప్త నేతలతో భేటీ అనంతరం బండి సంజయ్‌ ఢల్లీి టూర్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బండికి ఎలాంటి అంశాలపై హైకమాండ్‌ దిశానిర్దేశం చేయనుందనే చర్చ జరుగుతోంది.

ఓవర్‌ టూ ఢల్లీి…

హైదరాబాద్‌, జూన్‌ 27 :
ఢల్లీి సెంట్రిక్‌గానే ఇప్పుడు తెలంగాణ రాజకీయం నడుస్తోంది. అటు కాంగ్రెస్‌ నేతలంతా ఢల్లీి బాట పడుతుంటే.. ఇటు బీజేపీ నేతలు కూడా హస్తినలోనే మకాం వేశారు. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ పరిస్థితులపై ఫోకస్‌ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ముఖ్య నేతలతో భేటీ అవుతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బండికి ఢల్లీి నుంచి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ నేతలతో బీజేపీ జాతీయ నాయకత్వం వరుసగా జరుపుతున్న చర్చల వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి..?తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిరచాలని చూస్తున్న బీజేపీ క్రమక్రమంగా స్పీడ్‌ పెంచుతోంది. ఈ క్రమంలోనే కీలక నేతలను ఢల్లీికి పిలిపించుకుని చర్చలు జరుగుతోంది జాతీయ నాయకత్వం. ఇటీవలే ఈటెల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. రాష్ట్ర రాజాకీయాల్లో తాజా పరిస్థితులపై చర్చించారు. ఇరువురి నాయకుల వెర్షన్‌ ఏమిటనేది క్లియర్‌గా విన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢల్లీి నుంచి బండికి పిలుపు వచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ కూడా హుటాహుటిన ఢల్లీి పెద్దలను కలిసేందుకు హస్తినకు బయలుదేరారు.కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీలో జరిగిన పలు అనూహ్య పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయనే చర్చలు ఉన్నాయి. కమల నేతల వివాదాస్పద కామెంట్లు, నాయకుల తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయనే వాదన కూడా లేకపోలేదు. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే దక్షిణాదిలో పాగా వేయడం కష్టమేనని బీజేపీ హైకమాండ్‌ భావించి నేతలతో ఈ సవిూక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పార్టీలోని అసంతృప్త నేతలతో భేటీ అనంతరం బండి సంజయ్‌ ఢల్లీి టూర్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బండికి ఎలాంటి అంశాలపై హైకమాండ్‌ దిశానిర్దేశం చేయనుందనే చర్చ జరుగుతోంది.

About The Author