ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేయాలి: మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
గుమ్మడిదల,( సంగారెడ్డి) భారతశక్తి, ప్రతినిధి, ఫిబ్రవరి 14:: గుమ్మడిదలను మరో లగచర్లగా గా మార్చవద్దని ప్రజల నిర్ణయాన్ని గౌరవించి తక్షణమే డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేయాలని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిరసనకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు. ఆయనతోపాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు చింతా ప్రభాకర్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పాల్గొన్నారు . ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. గుమ్మడిదల రైతులు బంగారం వంటి పంటలు పండిస్తారు. వారి భూములను మరో లగచర్లగా మార్చవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలన అమలు చేస్తున్నారని విమర్శించారు. వందలాది స్థానికులను అన్యాయంగా అరెస్ట్ చేస్తూ, రాత్రికి రాత్రి పనులు మొదలు పెట్టడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు వద్దని జిల్లా కలెక్టర్ కు తెలియజేశారని. హైకోర్టు కూడా రెండు సార్లు పనులు ఆపాలని చెప్పినప్పటికీ, ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా ఈ సమస్యపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి డంపింగ్ యార్డు ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలి. లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు . ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు చిమ్ముల జైపాల్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, కొలాన్ బాల్రెడ్డి, వెంకటేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, రాజేష్,నరసింహారెడ్డి, తులసీదాస్,మద్దుల బాల్రెడ్డి సంతోష్ రెడ్డి, సదానంద రెడ్డి ముదిరాజ్ సంఘం నాయకులు జేఏసీ నాయకులు, రైతు సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదల,( సంగారెడ్డి) భారతశక్తి, ప్రతినిధి, ఫిబ్రవరి 14:: గుమ్మడిదలను మరో లగచర్లగా గా మార్చవద్దని ప్రజల నిర్ణయాన్ని గౌరవించి తక్షణమే డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేయాలని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిరసనకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు. ఆయనతోపాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు చింతా ప్రభాకర్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. గుమ్మడిదల రైతులు బంగారం వంటి పంటలు పండిస్తారు. వారి భూములను మరో లగచర్లగా మార్చవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలన అమలు చేస్తున్నారని విమర్శించారు. వందలాది స్థానికులను అన్యాయంగా అరెస్ట్ చేస్తూ, రాత్రికి రాత్రి పనులు మొదలు పెట్టడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు వద్దని జిల్లా కలెక్టర్ కు తెలియజేశారని. హైకోర్టు కూడా రెండు సార్లు పనులు ఆపాలని చెప్పినప్పటికీ, ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
అసెంబ్లీ వేదికగా ఈ సమస్యపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి డంపింగ్ యార్డు ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలి. లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు . ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు చిమ్ముల జైపాల్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, కొలాన్ బాల్రెడ్డి, వెంకటేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, రాజేష్,నరసింహారెడ్డి, తులసీదాస్,మద్దుల బాల్రెడ్డి సంతోష్ రెడ్డి, సదానంద రెడ్డి ముదిరాజ్ సంఘం నాయకులు జేఏసీ నాయకులు, రైతు సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
