బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పటాన్చెరు:
దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు సాధించడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని.. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని.. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి, బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలు రూపుమాపి అందరికీ సమ న్యాయం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న రాష్ట్రాల ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని తెలిపారు.. నేటితరం యువత అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరారు.
About The Author
13 May 2026
