ఘనంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన వేడుకలు
దుబ్బాక:
దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హబ్సిపూర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకుల మధ్య కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా వారికీ పార్టీ నాయకులు, ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లు గారి రామచంద్రారెడ్డి, 19వ వార్డు ఇంచార్జ్ సిరిసిల్ల నరేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, ఆయన నాయకత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
About The Author
19 Apr 2026
