వైఎస్ఆర్ కుటుంబ అభిమానంతో రాజకీయాల్లోకి రజితా రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 17(భారత శక్తి): రాజకీయాల్లోకి రావాలన్న, ఎదుగాలన్న, ఉన్నతమైన పదవులు పొందాలన్న, పార్టీలో కొనసాగాలన్న రాజకీయ గురువు, బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదగలేమనేది నానుడి ఉవాచ.రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై ఎస్ రాజశఖర్ రెడ్డి కుటుంబ అభిమానంతో 2021వ సంవత్సరం నుంచి చురుకైన మహిళా కార్యకర్తగా గుర్తింపు పొంది ముందుకు సాగుతుంది వెన్నం రజితా రెడ్డి. 2021లో తెలంగాణ రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కుమార్తె వై ఎస్ షర్మిల స్థాపించిన వై ఎస్ ఆర్ టి పి లో చేరి జిల్లా పార్టీలో జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగారు.అలాగే షర్మిల తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రలో చురుగ్గా పాల్గొని వై ఎస్ ఆర్ కుటుంబంలో మంచి పేరును సంపాదించారు. అయితే 2023వ సంవత్సరంలో వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మహిళా కార్యకర్తగా చేరారు. అప్పటి నుంచి పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ నాయకుల మన్ననలను పొందింది..ఆ క్రమంలోనే కార్యకర్త స్తాయి నుంచి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నియామకం అయింది.నిత్యం పార్టీలో అందరితో కలిసిపోయి ఉండటంతో, కార్యక్రమాలకు అందుబాటులో ఉండటంతోనే పార్టీలో రజితారెడ్డి కి పేరుంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటుందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి సమక్షంలో వెన్నం రజితా రెడ్డిని డిసిసి మహిళా కాంగ్రెస్ విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా రజితా రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన కార్యక్రమాన్ని పార్టీ పెద్దల సహకారంతో విజయవంతం చేస్తానని చెప్పారు. నాపై నమ్మకంతో నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలికి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షులు కె. సత్యనారాయణ,సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు సత్యప్రసన్నరెడ్డి కృతజ్ఞతలు తెలియజేసారు.

About The Author