బిజెపిలో చేరిన సాహితీ హాస్పిటల్ అధినేత రాము
సంగారెడ్డి:
సంగారెడ్డి పట్టణానికి చెందిన సాహితీ హాస్పిటల్ అధినేత రాము గురు స్వామి బీజేపీలో చేరారు. ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు.ఈ సందర్భంగా రాము గురు స్వామి మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో ముందుంటానని, బీజేపీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి దేశ్ పాండే, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి పోచారం రాములు, ముత్తిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నర్సింగరావు, పవన్ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు కసినివాసు, దోమల విజయకుమార్, మందుల నాగరాజ్, క్రాంతి, అజయ్, శ్రీనివాసరెడ్డి, కంది శివ కుమార్, విట్టల్ దాస్, ప్రభాకర్, శ్రీధర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
