డబ్ల్యూ జే ఐ జిల్లా అధ్యక్షులు జగన్నాథ రెడ్డిని సన్మానించిన ఆర్బివిఆర్ఆర్

WhatsApp Image 2025-12-30 at 4.39.43 PM

కరీంనగర్ : 

వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (బిఎంఎస్) జిల్లా అధ్యక్షులు దారం జగన్నాథ రెడ్డిని ఆర్ బి వి ఆర్ ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు..

మంగళవారం నగరంలోని సీతారాంపూర్ లోని రెడ్డి సంక్షేమ సంఘం పంక్షన్ హాలులో జిల్లా అధ్యక్షులు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, కోశాధికారి కాసర్ల మధుకర్ రెడ్డి, సలహా మండలి సభ్యులు  ఉచ్చిడి మోహన్ రెడ్డి, బద్దం మోహన్ రెడ్డి, భూంపెల్లి రాఘవ రెడ్డి, పెండ్యాల కేశవ రెడ్డి, వడియాల యశ్వంత్ రెడ్డిలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ  జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడి జిల్లా పేరును ఆదర్శంగా తీసుకురాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఆర్ బి వి ఆర్ ఆర్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు గన్ను మహేందర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శులు దాసరి రాంరెడ్డి, ద్యావ భాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చింతల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రేకులపల్లి రవీంధర్ రెడ్డి, కంట్టారెడ్డి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.

About The Author