రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి - రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య

  • రంజోల్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ

రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి -  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య

సంగారెడ్డి:


రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అన్ని విధాలా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా రంజోల్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వసతి, భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలను పరిశీలించారు.విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని  కమిషన్ చైర్మన్ సూచించారు. విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేసి భోజనం నాణ్యంగా ఉందని ప్రశంసించారు.మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా,  విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
పోషకాహారం ఆరోగ్యానికి ఎంతో అవసరమని, విద్యార్థులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని వివరించారు. అలాగే విద్యార్థులందరూ చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు.
విద్యాలయ ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో జహీరాబాద్ శాసన సభ్యులు మాణిక్ రావు,ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, సోషల్ వెల్ఫేర్ డీడీ అఖిలేష్ రెడ్డి, రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts