జి.హెచ్.ఎం.సి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సాబ్ ఏ క్యా హై..?

  • *జీ.హెచ్.ఎం.సీ లో అవినీతి తిమింగలాలు: నిధుల దుర్వినియోగంపై నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వ అధికారుల దౌర్జన్యం .
  • *మరణించిన మహిళ పేరిట ఫ్యామిలీ పెన్షన్ డ్రా చేసిన రికార్డ్ అసిస్టెంట్!
  • చర్యల నివేదిక (ATR) అడిగితే బాధితులపై అధికారుల దురుసు ప్రవర్తన
  • జి.హెచ్.ఎం.సి అడిషనల్ కమిషనర్ అడ్మిన్ శంకరయ్య పై చర్యలు తీసుకోవాలి..!
  • జి.హెచ్.ఎం.సి విజిలెన్స్ ఏ.సి.బి నిగా వివాగాలు ఏం చేస్తున్నాయి. 
  • మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి,మున్సిపల్ శాఖ సెక్రెటరీ జయేష్ రంజన్ దృష్టి సారించాలి..!

జి.హెచ్.ఎం.సి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సాబ్ ఏ క్యా హై..?

జీహెచ్‌ఎంసీ  కార్యాలయం ప్రజా సేవకు కాదు, అవినీతి తిమింగలాల సుఖవాసానికి కేరాఫ్ అడ్రస్‌గా మారినట్లుంది! చనిపోయిన మహిళనూ వదలకుండా పింఛన్ నిధులు నొక్కేసిన ఓ ఘనపాఠి ‘రికార్డ్ అసిస్టెంట్’ లీలలు బయటపెడితే.. చర్యలు తీసుకోవాల్సిన సాబ్స్, బాధితులపైనే సింహాల్లా గర్జిస్తున్నారు. ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ అడిగితే అడిషనల్ కమిషనర్ శంకరయ్య అండ్ కో ప్రదర్శిస్తున్న అహంకారం చూస్తుంటే, వీరు పౌర సేవకులా లేక అవినీతికి అంగరక్షకులా అనే అనుమానం కలగక మానదు. కమిషనర్ ఆర్.వి.కర్ణన్ గారూ.. మీ కళ్లెదుటే సాగుతున్న ఈ ‘పెన్షన్’ దోపిడీపై ఏసీబీ, విజిలెన్స్ బ్రహ్మాస్త్రాలు ఎప్పుడు కదులుతాయి? లంచగొండుల దౌర్జన్యానికి చరమగీతం పాడేదెన్నడు?

హైదరాబాద్:

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో అవినీతి వ్యవహారాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పెన్షన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఓ ఉద్యోగిపై ఫిర్యాదు చేస్తే, దానికి సంబంధించిన ‘చర్యల నివేదిక’ (యాక్షన్ టేకెన్ రిపోర్ట్) ఇవ్వకుండా అధికారులు బాధితులను వేధిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పే జీహెచ్ఎంసీ యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో మాత్రం సమాచారం అడిగిన పౌరులను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తోంది.WhatsApp Image 2026-05-22 at 19.15.52 (1)WhatsApp Image 2026-05-22 at 19.15.52 (1)

*చనిపోయిన వారి పేరిట పెన్షన్ దోపిడీ!
వివరాల్లోకి వెళ్తే.. జీహెచ్ఎంసీ రవాణా విభాగంలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేసిన మొహమ్మద్ సలీమ్ అనే ఉద్యోగి తీవ్ర అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దివంగత హాజీ బేగం అనే మహిళ మరణించిన తర్వాత కూడా, ఆమె బతికే ఉన్నట్లు చూపిస్తూ ఆమె పేరిట వచ్చే ‘కుటుంబ పింఛను’ (ఫ్యామిలీ పెన్షన్) నిధులను సదరు ఉద్యోగి అక్రమంగా డ్రా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు.
ఈ భారీ కుంభకోణంపై ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ ప్రతినిధులు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. (ఫిర్యాదు గుర్తింపు సంఖ్య: 13629752). ఈ ఫిర్యాదు ఆధారంగా గతంలోనే (07-10-2021 నాటి కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం) సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించి, అతడిని సస్పెండ్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

*సమాచారం అడిగితే దురుసు సమాధానాలు!
అయితే, ఈ ఫిర్యాదుపై ప్రస్తుతం జీహెచ్ఎంసీ తీసుకున్న పూర్తి స్థాయి చర్యల నివేదిక (ATR) ఇవ్వాలని ఫోరమ్ ప్రతినిధులు కోరగా, ప్రధాన కార్యాలయంలోని కొందరు అధికారులు పారదర్శకతకు గూటం పడుతున్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌కు చెందిన అధికారులు హరి రతన్ (ఏఎంసీ), శంకరయ్య, బాలాజీ అనే అధికారులు సమాచారం ఇవ్వకుండా బాధితులను వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అధికారుల నిర్లక్ష్యపు మాటలు ఇవే:
“నీకు చర్యల నివేదిక ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు.”

“మేము రిపోర్ట్ ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకో.

 “పై అధికారికి ఫార్వార్డ్ చేశాం, తర్వాత వాళ్లే చూసుకుంటారు.”

అంటూ సదరు అధికారులు బాధ్యతారాహిత్యంగా, అవమానకరంగా మాట్లాడటమే కాకుండా.. ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించడం లేదని ఫోరమ్ ప్రతినిధులు మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

*ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం: బాధితుల ఆవేదన.


ప్రజా ప్రయోజనాల కోసం ఒక పౌరుడు లేదా స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసినప్పుడు, దానిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీ అధికారులు పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తూ సమాచారాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై వారు క్రింది డిమాండ్లను లేవనెత్తారు:
 తక్షణ నివేదిక: అవినీతి ఉద్యోగిపై తీసుకున్న పూర్తి స్థాయి చర్యల నివేదికను (ATR) వెంటనే బహిర్గతం చేయాలి.
 
అధికారులపై విచారణ: సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన హరి రతన్, శంకరయ్య, బాలాజీలపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
 
క్రిమినల్ కేసులు: ప్రభుత్వ పెన్షన్ నిధులను దారి మళ్లించిన బాధ్యులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.WhatsApp Image 2026-05-22 at 19.17.44

 *వ్యవస్థలో మార్పు:
జీహెచ్ఎంసీ ప్రజా ఫిర్యాదుల (గ్రీవెన్స్) విభాగంలో పారదర్శకత పెంచాలి.
ఈ అవినీతి బాగోతాన్ని, అధికారుల అహంకార వైఖరిని ప్రజల ముందుకు తీసుకువచ్చి న్యాయం జరిగేలా చూసేందుకే మీడియాను ఆశ్రయించినట్లు ఫోరమ్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

About The Author