ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు..
- ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు.
- పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
- వివిధ కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
పటాన్‌చెరు:
ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలు ఎంతో నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కాలనీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ వార్డులలో అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్ల నిర్మాణ పనులకు పాలకవర్గం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పాండు, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు మమత, వెంకటేష్, ఆంజనేయులు, రాహుల్ రెడ్డి, ఈశ్వరమ్మ, కిషోర్ రెడ్డి, మంజుల, సంధ్య నవీన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, లత, అరుణ్, రాజు, కో ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, నిజాముద్దీన్ బాబా, సోనియా రాజు, ఆసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.
