బైంసా టౌన్ ఎస్‌హెచ్‌వోగా సాయికుమార్ బాధ్యతలు స్వీకరణ
ఉమ్మడి ఆదిలాబాద్:
నిర్మల్ జిల్లా బైంసా పట్టణ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌హెచ్‌వోగా ఇన్‌స్పెక్టర్ సాయికుమార్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీసీఆర్‌బీ (DCRB) నిర్మల్‌లో విధులు నిర్వహించిన ఆయనను ఇటీవల బైంసా టౌన్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.
పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
