తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి ముగ్గు
ట్రాఫిక్ నిబంధనలు, చైనా మాంజా ప్రాణాలకు ముప్పు వంటి అంశాలపై అవగాహన కలిగించే చిత్రాలతో సంక్రాంతి ముగ్గు కార్యక్రమం
సంగారెడ్డి:
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సంక్రాంతి ముగ్గు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణను అందమైన రంగురంగుల ముగ్గులతో సుందరంగా అలంకరించారు.
ట్రాఫిక్ నిబంధనలు, చైనా మాంజా ప్రాణాలకు ముప్పు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు వంటి అంశాలను ప్రతిబింబించే చిత్రాలతో ప్రజలకు అవగాహన కలిగే విధంగా, తెలుగుదనం ఉట్టిపడేలా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ వనజ ఈ ముగ్గును అందంగా అలంకరించింది. 
ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు, సమాజంలో సాంస్కృతిక విలువలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు సంక్రాంతి పండుగను శిఖ సంతోషాలతో, ఆనందోత్సాహలా నడుమ జరుపుకోవాలని, పండుగ వేళ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
