టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సంక్రాంతి ముగ్గుల కార్యక్రమం
కామారెడ్డి జిల్లా :
మంగళవారం టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 2026 పురస్కరించుకుని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము ప్రాంగణంలో అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించబడినవి.
ఇట్టి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్ మధుమోహన్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఇట్టి టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 2026 కార్యక్రమంలో భాగంగా మహిళా ఉద్యోగులు వేసిన ముగ్గులకు గాను మొదటి బహుమతి శాంభవి, శాంతి విద్యా శాఖ వారికి, ద్వితీయ బహుమతినీ రోజా రాణి రవళి రెవెన్యూ శాఖ అదేవిధంగా గౌతమి అరుణ మత్స్యశాఖ వారు గెలుచుకోవడం జరిగినది. అదేవిధంగా తృతీయ బహుమతిని ప్రియాంక పద్మ గార్లు ఆడిట్, చీఫ్ ప్లానింగ్ శాఖ పొందడం జరిగింది.
టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 2026 కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగుల ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని అదేవిధంగా మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందు ఉండి జిల్లా కార్యాలయాల్లో వారి పనులను సంతృప్తికరంగా నిర్వహించుకుని జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని కోరడం జరిగినది. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు అభినందించి జిల్లా ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ముల్క నాగరాజు, కోశాధికారి ఎం. దేవరాజు, ఉపాధ్యక్షులు రాజ్యలక్ష్మి ఎంసీ పోచయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, కల్చరల్ సెక్రటరీ రాజ్ కుమార్, ఈసీ నెంబర్లు సాయినాథ్, లక్ష్మణ్, దత్తాద్రి,
అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, సృజన్,
జిల్లా క్లాస్ ఫోర్ సంగం కార్యదర్శి మక్బూల్, వారి కార్యవర్గ సభ్యులు, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయము మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
