మహిళా శక్తికి దర్పణం : ఐకేపీ డైరీ ఆవిష్కరణలో షబ్బీర్ అలీ
కామారెడ్డి జిల్లా :
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం ప్రగతి పథంలో పయనిస్తుంది. ఇందుకు ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) సంఘాల కృషి వెలకట్టలేనిది" అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కొనియాడారు.
ఆదివారం కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో ఏర్పాటు చేసిన ఐకేపీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి కట్టుబడి ఉందని, గతంలో ప్రకటించిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో మహిళలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
కామారెడ్డి తన సొంత గడ్డని, ఇక్కడి ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం ఎంతైనా కష్టపడతానని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.
ఐకేపీ కార్యాలయాల భవన నిర్మాణాలు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
