జిల్లాను సురక్షితంగా నిలబెడుతాం
గతంకన్న 16శాతం క్రైమ్ రేటు దగ్గుదల
సైబర్ నేరగాళ్ల రూ.1.10 కోట్ల రికవరీ
కరీంనగర్ పోలీస్ బెస్ట్
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం 2025 వార్షిక నివేదిక విడుదల

కరీంనగర్ :
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టడంలో కరీంనగర్ పోలీసులు మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తంగా 16.84 శాతం మేరకు నరాల్లో తగ్గుదల రికార్డయింది. ట్రాపిక్ చలాన్లు అమాంతం పెరిగాయి. ఎన్పోర్స్మెంట్ లో సీసీ కెమెరాలు, డ్రోన్ల వినియోగం, ప్రాపర్తి రికవరీ లో గతేడాది (25.92)శాతం కన్నా ఈ సారి 49.52 శాతం మేర మెడుగుదల చూపించాయని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యమిచ్చి, మహిళ పోలీసులకు పెద్దపీట వేస్తున్నాం, 2025లో పోలీస్ స్పోర్ట్స్ మిట్, ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రామపంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహించామన్నారు. డయల్ 100 పిర్యాదు వచ్చిన వెంటనే ఏడు నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుంటున్నామని తెలియజేశారు. ఈ ఏడాది క్రైమ్ రేటు తగ్గడం శుభ పరిణామమని సిపి గౌస్ అలం వివరించారు. కమిషనరేట్ కేంద్రంలో కరీంనగర్ పోలీస్ - 2025 వార్షిక నివేదికను విడుదల చేశారు.
గతేడాదిలో 6,124 కేసులు కాగా, ఈ ఏడాది 5,126 కేసులే నమోదు అయ్యాయి మొత్తంగా 16.84 శాతం మేరకు నేరాల్లో గణనీయమైన తగ్గుదల నమోదైందని సిపి చెప్పారు
ఆస్తి రికవరీలో బేస్, తగ్గిన కేసులు
రాబరీ, చైన్ స్నాచింగ్, దొంగతనం కేసులు గతంలో పోల్చితే పెరిగాయి. ఆస్తి నేరాలన్నింటినీ చూస్తే మొత్తంగా 18శాతం పెరిగాయి. నేరాల చేదన, రికవరి సైతం పెరిగింది. ఘోర నేరాలు (Grave Crimes) 9.09 శాతం తగ్గాయి. మహిళలపై నేరాలు 5.18 శాతం తగ్గుముఖం పట్టాయి. 2025లో ఆస్తి నేరాల రికవరీలో 24 శాతం వృద్ధి సాధించి, రూ. 4.11.98.269 పోగొట్టుకోగా రూ. 2.04.40.762తో 49 శాతం విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. ఈ ఏడాది 2,437 ఫిర్యాదులు అందగా, అందులో 280 కేసులు నమోదు చేసి, బాధితులకు రూ. 1.10 కోట్లను తిరిగి ఇప్పించినట్లు చెప్పారు. అలాగే, CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న 500కు పైగా మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసి బాధితులకు అందజేశామని వివరించారు.
సామాజిక బాధ్యత
మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా ఎస్ హెచ్ ఈ టీమ్స్, భరోసా కేంద్రాలు చురుగ్గా పనిచేశాయని సీపీ తెలిపారు. మానవ అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా 9 మంది బాధితులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం 29 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, అక్రమ ఇసుక రవాణాపై 170 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
శాంతిభద్రతల నిర్వహణ:
2025లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని సీపీ పేర్కొన్నారు. శ్రీరామనవమి నుండి క్రిస్మస్ వరకు అన్ని పండుగలను మతసామరస్యంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తి చేయడంలో ప్రజల సహకారం మరువలేనిదని ఆయన కొనియాడారు.
ట్రాఫిక్, ప్రజా స్నేహిత పోలీసింగ్
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై 3.83 లక్షల ఈ-చలాన్లు, లేజర్ గన్ ద్వారా 17,491 కేసులు నమోదు చేశామని, దీనివల్ల రోడ్డు ప్రమాదాల్లో స్వల్ప తగ్గుదల కనిపించిందని తెలిపారు. "ప్రజా స్నేహిత పోలీసింగ్, ఆధునిక సాంకేతికత వినియోగంతో కరీంనగర్‌ను మరింత సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతాం" అని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరీంనగర్ ను నేరాల నియత్రణలో మొదటి స్థానంలో నిలుపుతామని చెప్పారు. మిస్సింగ్ కేసులను లోతుగా విచారిస్తున్నామని, చాలా వరకు మిస్టరీ మార్డర్లుగా మారుతున్నాయని, నాణ్యమైన దర్యాప్తు తోనే కేసులను వేగంగా చేధిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, మాధవి, రిజర్వు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు.
