యూరియా నిల్వలను తనిఖీ చేసిన : డిఎఓ సురేష్ కుమార్

మంగపేట/ములుగు జిల్లా ప్రతినిధి :
ములుగు జిల్లా మంగపేటమండలంలోని యూరియా నిల్వవలను తనిఖీ చేసి ఎరువుల సరఫరా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనతో పాటు ఎటునాగారం ఏడీఏ అవినాష్ వర్మ తో కలిసి మంగపేట మండలంలోని వివిధ ఎరువుల డీలర్ అవుట్‌లెట్లను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో భాగంగా డీలర్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఫైవ్స్ యాప్ ద్వారా ధృవీకరించారు. స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, బిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించి, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీలర్లకు సూచించారు.
జిల్లాలో 814 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నదని... ఇంకనూ 2354 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయుటకు సిద్ధంగా ఉన్నామని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని సురేష్ కుమార్ తెలిపారు.
