5 వేల మందితో భారీ ఎత్తున స్వదేశీ జాగరణ మంచ్ ‘జాబ్ మేళా : స్వదేశీ మేళా కన్వీనర్ రాజేశ్వరరావు
కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి): స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 16 వరకు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో తలపెట్టిన ‘స్వదేశీ మేళా’ కోసం శనివారం భూమి పూజ నిర్వహించారు . ఈ సందర్భంగా స్వదేశీ మేళా బాధ్యులు చల్మెడ రాజేశ్వరరావు , ముక్క హరీష్ బాబు లు మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మేళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ స్వదేశీ మేళాలో దాదాపు 2 లక్షల మంది పాల్గొనేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా దేశీయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. 210కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామని, ఉద్యోగాల కల్పన కోసం 120 కంపెనీలు స్వదేశీ మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.. ఈనెల 9వ తేదీన ఉదయం 6 గంటలకు కరీంనగర్లోని పలు ప్రాంతాల మీదుగా సైకిల్ ర్యాలీ ని, 10 తేదీన 5 కె రన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. స్వదేశీ మేళా ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ మేళా బాధ్యులు మాధవరావు, నిరంజనా చారి , ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, గంప వెంకట్, కళ్లెం వాసుదేవ రెడ్డి , గోపికృష్ణ, పాక సత్యనారాయణ, నాగమల్ల వేణుమాధవ్, పుల్లూరి సంతోష్ అభిలాష్, అభిలాష్, మునీందర్, వేద పండితులు శ్రీ మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి):
స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 16 వరకు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో తలపెట్టిన ‘స్వదేశీ మేళా’ కోసం శనివారం భూమి పూజ నిర్వహించారు . ఈ సందర్భంగా స్వదేశీ మేళా బాధ్యులు చల్మెడ రాజేశ్వరరావు , ముక్క హరీష్ బాబు లు మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మేళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ స్వదేశీ మేళాలో దాదాపు 2 లక్షల మంది పాల్గొనేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా దేశీయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. 210కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామని, ఉద్యోగాల కల్పన కోసం 120 కంపెనీలు స్వదేశీ మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.. ఈనెల 9వ తేదీన ఉదయం 6 గంటలకు కరీంనగర్లోని పలు ప్రాంతాల మీదుగా సైకిల్ ర్యాలీ ని, 10 తేదీన 5 కె రన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. స్వదేశీ మేళా ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ మేళా బాధ్యులు మాధవరావు, నిరంజనా చారి , ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, గంప వెంకట్, కళ్లెం వాసుదేవ రెడ్డి , గోపికృష్ణ, పాక సత్యనారాయణ, నాగమల్ల వేణుమాధవ్, పుల్లూరి సంతోష్ అభిలాష్, అభిలాష్, మునీందర్, వేద పండితులు శ్రీ మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
