జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
- జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి :
:
రాజీమార్గమే - రాజా మార్గమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడేలా లోక్ అదాలత్ దోహదపడుతుందని, ఈ నెల 15 వ తేది వరకు జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. రాజీ పడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో ఇరువర్గాల సమ్మతితో రాజీకి కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
