యుద్ద వీరుల త్యాగాలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించదు-.బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ జూలై 2: భారత్ పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరుడైన లాన్స్ నాయక్ పి.గోపయ్య చారి త్యాగం చిరస్మరణీయమని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని లారీ అసోసియేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఇండియన్ వేటరన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గిల్ యుద్ధ వీరుడు లాన్స్ నాయక్ గోపయ్య చారి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….. శత్రువులు దేశ సరిహద్దులు దాటి రాకుండా సరిహద్దుల్లో నిలబడి పహారా కాసి దేశ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల త్యాగాలు వెలకట్టలేమన్నారు. కుటుంబాలను వదిలి జీవితాలను త్యాగం చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తున్న సైనికులు నిజమైన దేవుల్లు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైనికుల త్యాగాలను విస్మరించదన్నారు. దేశం కోసం ప్రాణం త్యాగాలు చేసిన సైనికుల కుటుంబాల కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. ప్రణతిగంతో గోపయ్య చారి రాష్ట్ర పేరు ప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తంగా చాటారని కొనియాడారు గోపయ్య చారి ఆశయాలను సాధించాలన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వెటర్నర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వెటర్నర్ అసోసియేషన్ సభ్యులు, గోపయ్య చారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

యుద్ద వీరుల త్యాగాలను తెలంగాణ ప్రభుత్వం  విస్మరించదు-.బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ జూలై 2:
భారత్ పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరుడైన లాన్స్ నాయక్ పి.గోపయ్య చారి త్యాగం చిరస్మరణీయమని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని లారీ అసోసియేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఇండియన్ వేటరన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గిల్ యుద్ధ వీరుడు లాన్స్ నాయక్ గోపయ్య చారి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….. శత్రువులు దేశ సరిహద్దులు దాటి రాకుండా సరిహద్దుల్లో నిలబడి పహారా కాసి దేశ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల త్యాగాలు వెలకట్టలేమన్నారు. కుటుంబాలను వదిలి జీవితాలను త్యాగం చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తున్న సైనికులు నిజమైన దేవుల్లు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైనికుల త్యాగాలను విస్మరించదన్నారు. దేశం కోసం ప్రాణం త్యాగాలు చేసిన సైనికుల కుటుంబాల కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. ప్రణతిగంతో గోపయ్య చారి రాష్ట్ర పేరు ప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తంగా చాటారని కొనియాడారు గోపయ్య చారి ఆశయాలను సాధించాలన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వెటర్నర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వెటర్నర్ అసోసియేషన్ సభ్యులు, గోపయ్య చారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author